తెలంగాణ ఉద్యమసారధి .. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన తెలంగాణ పోరాట నేపధ్య కథతో తెరకెక్కిన చిత్రం ''ఉద్యమసింహం''. నటరాజన్, మాధవి రెడ్డి, జలగం సుధీర్, లత ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. పద్మనాయక ప్రొడక్షన్స్ పతాకం పై కల్వకుంట్ల నాగేశ్వర రావు నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ఈ సందర్బంగా నిర్మాత కల్వకుంట్ల నాగేశ్వర రావు ట్రైలర్ విడుదల చేసారు.
అనంతరం అయన మాట్లాడుతూ .. ఉద్యమ సింహం సినిమా కేసీఆర్ జీవిత కథ కాదు. ఇది తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ నేతృత్వంలో సాగిన అంశాల నేపథ్యంగా తెరకెక్కించిన కథ. ఎన్ని ఒడిడుకులు ఎదుర్కొని పోరాడి తెలంగాణను కేసీఆర్ సాధించాడు. ఆ తరువాత దాన్ని బంగారు తెలంగాణ గా మార్చేందుకు అయన చేస్తున్న కృషి ఏమిటన్నది ఈ సినిమా. కేసీఆర్ పాత్రలో నటరాజన్ చక్కగా నటించారు. అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ సినిమా ఉంటుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తికావొచ్చాయి. ఈ నెల 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అన్నారు.
దర్శకుడు కృష్ణంరాజు మాట్లాడుతూ .. తెలంగాణ ఉద్యమం ఎంత ఉదృతంగా సాగింది. ప్రత్యేక తెలంగాణ కోసం ఎందరో ఉద్యమాలు నడిపారు కానీ ఒక్క కేసీఆర్ మాత్రమే పోరాడి తెలంగాణను సాధించాడు. అయన సంకల్పం బలమైనది. తెలంగాణ కోసం కేసీఆర్ పోరాటం ఎలా జరిపారు అన్న అంశాలు ఈ సినిమాలో చూపిస్తున్నాం. నిర్మాత నాగేశ్వర రావు సపోర్ట్ మరవలేనిది ప్రతి విషయంలో ఎంతగానో సపోర్ట్ చేసారు. అలాగే మా టీం సపోర్ట్ కూడా ఉంది .. ముక్యంగా మ్యూజిక్ డైరెక్టర్ దిలీప్ బండారి ఇచ్చిన పాటలు హైలెట్ గా నిలిచాయి. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఉందని అన్నారు.
నటి లతా మాట్లాడుతూ .. ఈ సినిమాలో తెలంగాణ ఆడపడుచుగా అందరి అభిమానాన్ని అందుకున్న కవితక్క పాత్రలో నటించడం ఆనందంగా ఉంది .. ఆమె పుట్టినరోజు సందర్బంగా ఈ రోజు ఈ టీజర్ విడుదల చేయడం మరింత సంతోషంగా ఉంది అన్నారు.
మాటల రచయిత కృష్ణా రాపోలు మాట్లాడుతూ .. ఈ సినిమాకు మాటలు రాసె అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ .. కేసీఆర్ సినిమాకు మాటలు రాయడం అన్నది మాములు విషయం కాదు .. కానీ దర్శకుడు నాతొ చక్కటి మాటలను రాయించాడు. తప్పకుండా ఈ సినిమాలోని డైలాగ్స్ మీ అందరికి నచ్చుతాయని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో .. సూర్య, సాహిత్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.