ఆరు వరుస పరాజయాల తరువాత కొంత గ్యాప్ తీసుకున్న సాయిధరమ్ తేజ్ తాజాగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' రూపొందుతున్న విషయం తెలిసిందే. కల్యాణి ప్రియదర్శన్ .. నివేద పేతురాజ్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాలో, సునీల్ .. వెన్నెలకిషోర్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా నుంచి టీజర్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖాయం చేసుకున్నారు. రేపు ఉదయం 9 గంటలకు టీజర్ ను వదలనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనుల్లోనే దర్శకుడు కిషోర్ తిరుమల వున్నాడు. ప్రేమకథా చిత్రాలను యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఆయన చాలా బాగా తెరెకెక్కిస్తారనే పేరుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం యూత్ మనసులను కొల్లగొట్టేస్తుందని అంటున్నారు