అమెరికాలో జాతి వివక్షకు గురైన మరో బాలీవుడ్ నటి 

12 Mar,2019

ఈ మధ్య అమెరికాలో జాతి వివక్ష బాగా పెరిగిపోతుంది .. ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్స్ కి ఇలాంటి చేదు అనుభవం ఎదురైనా విషయం తెలిసిందే .. తాజాగా బాలీవుడ్ నటి, బిగ్ బాస్-7 ఫైనలిస్ట్ తనీషా అమెరికాలోని న్యూయార్క్ లో చేదు అనుభవం ఎదుర్కొంది. నగరంలోని జేన్ హోటల్ సిబ్బంది చేత జాతివివక్షకు ఆమె గురయింది. మార్చి 10వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుందని ట్విట్టర్ ద్వారా ఆమె తెలిపింది. జేన్ హోటల్ సిబ్బంది జాత్యహంకారం గల దారుణమైన వ్యక్తులంటూ కామెంట్ చేసింది. ఓ ఛారిటీకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు తనీషా న్యూయార్క్ వెళ్లింది. అక్కడ జేస్ హోటల్ బస చేసింది. ఈ సందర్భంగా తన సహచరులతో కలసి పార్టీ చేసుకుంటుండగా... హోటల్ సిబ్బందికి చెందిన ఒక వ్యక్తి దారుణ వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంలో హోటల్ యాజమాన్యంతో మాట్లాడేందుకు ప్రయత్నించినా, సాధ్యం కాలేదని ఆమె చెప్పింది. అమెరికాలో వర్ణవివక్షను ఎదుర్కోవడం తనకు ఇదే తొలిసారని తెలిపింది. బాలీవుడ్ సెలబ్రిటీలు వర్ణవివక్షను ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా శిల్పాషెట్టి 'బిగ్ బ్రదర్ 5' రియాల్టీ షోలో వర్ణవివక్షకు గురైంది. అయితే, ఆ షోలో ఆమె విజేతగా నిలవడం గమనార్హం.

Recent News