గీత ఆర్ట్స్ ఆఫీస్ పై ఐటి దాడులు 

10 Mar,2019

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ ఆఫీస్ పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేసినట్టు తెలిసింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు సంబందించిన ఆస్తులపై ఐడి అధికారులు ఆరా తీశారు. ఈ దాడుల గురించి పెద్దగా సంచలన వార్తలేవి రాలేదు .. ఎందుకంటే ప్రతి ఏడాది ఐటి శాఖ వారు చేసే మాములు వ్యవహారమని మెగా వర్గాలు తెలిపాయి.   2018-19 ఆర్ధిక సంవత్సరానికి గానూ గీతా ఆర్ట్స్ వారికి ‘గీత గోవిందం’.. ‘టాక్సీవాలా’ రూపంలో రెండు సూపర్ హిట్స్ వచ్చాయి. ఆ నేపథ్యంలోనే ఆ సినిమాల కలెక్షన్స్ లెక్కలు సరిగా ఉన్నాయా లేదా చూసేందుకు ఈ దాడులు జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఈ దాడులకు సంబంధించి అధికారికంగా మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. 

Recent News