ఇటీవల ట్రైలర్ తో సంచలనం సృష్టించిన కోలీవుడ్ అడల్ట్ మూవీ 90 ఏంఎల్. ఫెమినిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బిగ్ బాస్ సెన్సేషన్ ఓవియా ముఖ్య పాత్రలో నటించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ , స్మోకింగ్ సన్నివేశాలు ఇలా మొత్తం అడల్ట్ కంటెంట్ తో వచ్చే సన్నివేశాలు ఎంటర్టైన్ చేస్తాయట. 5 గురు టీనేజ్ గర్ల్స్ కు సంబందించిన స్టోరీ ఇది. లైఫ్ లో వారు ఎలాంటి కష్టాలు పడ్డారనే విషయాలను బేస్ చేసుకుని తెరకెక్కింది ఈ చిత్రం. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఇది చాలా తక్కువ’ అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు. అళగియ అసుర తెరకెక్కించిన ఈ చిత్రానికి తమిళ స్టార్ హీరో శింబు సంగీతం అందించాడు. తర్వలోనే ఈ చిత్రం యొక్క విడుదల తేది నీ ఖరారు చేయనున్నారు.