శర్వానంద్ ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒ సినిమాలో నటిస్తున్నాడు. జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో శర్వానంద్ రెండు విభిన్న గెటప్స్ లో కన్పిస్తాడనే సంగతి తెలిసిందే. అతి త్వరలో ఈ సినిమా టైటిల్ కూడా వెల్లడిస్తారట.
ఈమధ్యే స్పెయిన్ షెడ్యూల్ ను పూర్తి చేసుకొని ఇండియా వచ్చిన #శర్వా27 టీమ్ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుతున్నారు. మేలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన కాజల్ ఆగర్వాల్.. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు ప్రశాంత్ పిళ్ళై.