సక్సెస్ కోసమే ప్రయత్నం - సాయి తేజ్
సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న చిత్రం `చిత్రలహరి`. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం(మోహన్) నిర్మాతలు. నివేదా పేతురాజ్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 12న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా హీరో సాయి తేజ్ తో ఇంటర్వ్యూ ..
1, ఇందులో మీ పాత్ర ?
ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు విజయ్ కృష్ణ. తన జీవితంలో ఎప్పుడూ సక్సెస్ చూడలేదు. సక్సెస్ అంటే ఏంటో కూడా తెలీదు. అలాంటి ఓ యువకుడు ఫెయిల్యూర్స్‌ని అధిగమించి సక్సెస్‌ని ఎలా సాధించాడు అనేది సినిమా మెయిన్ కాన్సెప్ట్.
2, కథల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
ప్రతి సినిమా విజయం వెనుక ఒక టీమ్ వర్క్ ఉంటుందని నమ్ముతాను. అలాగే ప్రతి సినిమాకు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడతాను. ఆ ప్రాసెస్‌లో కొన్ని ఫెయిల్యూర్స్ రావొచ్చు. అవి సహజం. కానీ నటుడిగా ప్రతి సినిమా నాకు మంచి పేరు తెచ్చింది. కథలో కంటెంట్ బాగుంటే సక్సెస్ తప్పకుండా వస్తుంది. ప్రతి నటుడికి తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రతి శుక్రవారం ఒక అవకాశం ఉంటుందని నమ్ముతాను. నా గత అనుభవాల వల్ల స్క్రిప్ట్ నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పగలుగుతున్నా. దర్శకుడు కిషోర్ తిరుమల ఈ స్క్రిప్ట్ చెప్పగానే నాకు బాగా నచ్చింది. నా మనసులోంచి వచ్చిన మాటను నమ్మి ఈ సినిమా చేశాను.
3, దర్శకుడు చాలా కాలంగా మీకు తెలుసుకదా ? ఆయనతో సినిమాకు ఇంత సమయం పట్టింది?
- కిషోర్ తిరుమల నాకు చాలాకాలంగా ఆయన రైటర్‌గా ఉన్నప్పటి నుండి పరిచయం. ఆయన దర్శకుడిగా మారాక రామ్‌తో సినిమా చేశారు. ఆ సినిమా చూసి బాగా డైరెక్ట్ చేశారని, రామ్‌ని కూడా చాలా కొత్తగా చూపించారని అభినందించాను. స్నేహితుడైనంత మాత్రాన వెంటనే సినిమా చెయ్యాలని లేదు. అందుకనే నేను తనని అప్రోచ్ కాలేదు. తనకి సక్సెస్ వస్తే నాకు వచ్చినట్టే.
4 చాలా మంది ఈ సినిమాను తమ బయోపిక్‌లా ఫీలవుతున్నారు ?
అది నా వరకు కూడా వచ్చింది. చాలామంది ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో ఇది నా బయోపిక్‌లా ఉందని పోస్ట్ చేస్తున్నారు. ప్రతి మనిషి జీవితంలో అలాంటి ఒక ఫేజ్ ఉంటుంది. పోస్ట్ చేసిన ప్రతి ఒక్కరూ అలాంటిది ఎక్స్‌పీరియన్స్ చేసి ఉండుంటారు. ఈ సినిమా వారందరికీ ఒక మంచి ఫీల్‌ని ఇస్తుంది అని కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. ఈ సినిమాలో సక్సెస్ అవ్వనివారికోసం మంచి మెసేజ్ ఉంది. రిలీజయ్యాక ప్రతి ఒక్కరూ దానికి కనెక్ట్ అవుతారు.
5, మైత్రి మూవీ మేకర్స్ గురించి?
చాలా మంచి నిర్మాతలు, అలాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ నాకు ఆరు సినిమాల తర్వాత నన్ను నమ్మి ఛాన్స్ ఇవ్వడం చాలా హ్యాపీగా అన్పించింది. ఈ బేనర్ ప్రొడక్షన్ వేల్యూస్ గురించి అందరికీ తెల్సిందే. దర్శకుడికి ఏం కావాలో అవన్నీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సమకూర్చారు. ఆర్టిస్ట్‌లకి మంచి ఫ్రీడమ్ ఇస్తారు. మైత్రి మూవీ మేకర్స్ బేనర్‌లో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.
6, దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ గురించి?
దేవి అన్న సాంగ్స్‌ని నేను ఫస్ట్ నుండి ఫాలో అవుతున్నా. ఇప్పటికీ నా దగ్గర ఆయన సంగీతం అందించిన క్యాసెట్స్ ఉన్నాయి. ఆయన సాంగ్స్ విని ఎంతో ఎంజాయ్ చేసేవాడ్ని. నేను ఆయనతో కలిసి వర్క్ చేస్తానని అనుకోలేదు. మా అమ్మగారు కూడా నేను, దేవిశ్రీ కలిసి పని చేయాలని, ఆయన మ్యూజిక్‌ని నేను డ్యాన్స్ చేయాలని అంటూండేది. అది ఈ సినిమాతో నెరవేరింది.
7, సునీల్ గురించి ?
- సునీల్ అన్నతో కలిసి వర్క్ చేయాలని నాకు కోరిక ఉండేది. 'నువ్వు నేను', 'నువ్వేకావాలి' సినిమాలు చూసి ఒక్కసారన్నా ఆయనతో కలిసి వర్క్ చేయాలని అనుకునేవాడిని. నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి ఆయన హీరో అయ్యారు. కుదురుతుందో, లేదో అనుకున్నాను. ఈ సినిమాతో కుదిరింది. ఆఫ్ స్క్రీన్‌లో కూడా ఆయన నన్ను ఓ తమ్ముడిలా చూసుకున్నారు. ఈ సినిమాలో ఆయన అద్భుతంగా కామెడీ ఉంటుంది. కొన్ని సీన్స్‌లో అయితే సూపర్ ఫన్ జనరేట్ చేశారు.
8, 'గ్లాస్‌మేట్స్' సాంగ్ గురించి ?
ఫిబ్రవరిలో నాకు పూర్తి కథ చెప్పడం జరిగింది. అప్పుడే సాంగ్ కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. అప్పటికే 'ప్రేమ వెన్నెల', 'పరుగు పరుగు', 'గ్లాస్‌మేట్స్', 'ప్రయత్నమే' పాటలు గురించి చెప్పారు. కానీ డిసెంబర్‌లో 'గ్లాసు' గుర్తు వస్తుందని అనుకోలేదు.
9, హీరోయిన్స్ గురించి?
కల్యాణి, నివేదతో కలిసి నటించడం ఇదే ఫస్ట్ టైమ్ ఇద్దరూ మంచి పెర్‌ఫార్మెర్స్. వాళ్లు ఎలా చేస్తారో, నేను ఎలా రియాక్ట్ అవ్వాలా అని చిన్న ఎగ్జయిట్‌మెంట్ ఉండేది. మా ముగ్గురి మధ్య హెల్దీ కాంపిటీషన్ ఉంది.
10 మల్టీస్టారర్ చేస్తారని వార్తలొచ్చాయి ?
- కథ కుదరలేదు. అందుకే ఆ సినిమా చేయలేదు. కానీ కథ కుదిరితే డెఫినెట్‌గా మల్టీస్టారర్ చేస్తాను. ఆ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు.
నెక్స్‌ట్ ప్రాజెక్ట్స్?
రెండు, మూడు కాన్సెప్ట్స్ విన్నాను. ఏదీ ఫైనల్ కాలేదు..