సమంత ఇంటర్వ్యూ

02 Apr,2019

అవన్నీ నటనలో భాగమే - సమంత 

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయాలని అంటున్నారు .. నా ఉద్దేశంలో రెగ్యులర్ అన్నది వేరే అర్థం. నాకు సూపర్ డీలక్స్ , యూ టర్న్ తరహాలో భిన్నమైన పాత్రలు చేయాలి .. నటిగా ప్రూవ్ చేసుకోవాలన్నదే ఇప్పుడు నా ముందున్న ఆలోచన అని చెబుతుంది అందాల భామ సమంత.  నాగ చైతన్య ను పెళ్లి చేసుకున్న సామ్ పెళ్లి తరువాత ఎందుకు హీరోయిన్స్ సినిమాలు మానేయాలి అని ప్రశ్నిస్తుంది. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి గ్లామర్ హీరోయిన్ గా టాలీవుడ్ లో టాప్ స్టార్ గా ఎదిగిన సమంత ప్రస్తుతం భిన్నమైన పాత్రలు చేసేందుకు సిద్ధమైంది.  పెళ్లి తరువాత భర్త నాగచైతన్య తో కలిసి నటిస్తున్న చిత్రం మజిలీ. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది .. ఈ సందర్బంగా సమంత తో ఇంటర్వ్యూ ..  

@ పెళ్లి తరువాత ... 

పెళ్లి తరువాత చైతు తో కలిసి నటిస్తున్న మొదటి చిత్రమిదే. కరెక్ట్ గా పెళ్లి తరువాత మేమిద్దరం కలిసి నటించే కథ దొరికింది. 

@  రియల్ లైఫ్ లో   రీల్ లైఫ్ లో ... 

పెళ్ళికి ముందు చైతు తో కలిసి చేసినప్పుడు వేరేలా ఉండేది .. కానీ ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది. దాంతో పాటు మేమిద్దరం కలిసి సినిమా చేయడం అవసరమా అనిపిస్తుంది. ఎందుకంటే మా ఇద్దరి సినిమా అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు వేరేగా ఉంటాయిగా అందుకు. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ప్రేమ గురించి చాలా సినిమాలు వచ్చాయి .. కానీ పెళ్లి తరువాత ఆ జంట ఎలా ఉంటారు .. ముక్యంగా ఆ అమ్మాయి లైఫ్ తెలియని సెక్యూరిటీలో ఉంటుంది. కేరింగ్ .. ఒకరకమైన సంతృప్తి ఉంటుంది. అలాంటి విషయాలతో సరిగ్గా ఈ టైం లో శివ కథ తీసుకువచ్చాడు. 

@  పర్సనల్ లైఫ్ లో ... 

 ప్రేమలో ఉన్నపుడు కేర్ ఉంటుంది .. లవర్ విషయంలో తిన్నావా, ఎక్కడున్నావు .. లాంటి కేర్ ఉంటె పెళ్లి తరువాత సెక్యూరిటీ ఉంటుంది. దాంతో పాటు తెలియని సంతృప్తి ఉంటుంది. ఈ సినిమాలో నా పాత్ర పేరు శ్రావణి, భర్త అంటే అమితమైన ప్రేమ ఉన్న అమ్మాయి. చాలా సైలెంట్ .  నేనేమో ఎక్కువగా మాట్లాడతాను . శ్రావణి కి నాకు ఎలాంటి పోలికలు ఉండవు. 

@  చైతు నటన ... 

షూటింగ్ లో నా నటన కంటే కూడా చైతు నటననే ఎక్కువ గమనించేదాని .. అబ్బా ఇక్కడ బాగా చేసాడు .. ఇక్కడ బాగాలేదని మొహమాటం లేకుండా చెప్పేదాన్ని .. దాన్ని చూసి చైతు అవన్నీ డైరెక్టర్ చూసుకుంటారు నీ పని నువ్వు చూసుకో అనేవాడు. షూటింగ్ అయ్యాకా కూడా సినిమా గురించి చర్చించుకునేవాళ్ళం. 

 @ హీరోయిన్స్ పాత్రలకు  ప్రాముఖ్యత ... 

 గత మూడు నాలుగేళ్లుగా హీరియిన్స్ పాత్రలకు చాలా ప్రాముఖ్యత పెరిగింది. అంతకుముందు హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ కోసమే .. లేక పాటల కోసమే ఉండేవారు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఎందుకంటే అమ్మాయిలు ఎప్పుడైనా స్పెషల్ కదా. 

 @ సూపర్ డీలక్స్ ... 

 సూపర్ డీలక్స్ మంచి సక్సెస్ టాక్ రావడం ముక్యంగా నా పాత్రకు మంచి అప్లాజ్ వస్తుంది. ఈ సినిమాలోని పాత్ర గురించి నాపై ట్రోల్స్ వస్తాయని అనుకున్నాను .. కానీ బాగా చేసావని అంటుంటే ఆనందంగా ఉంది.  ఈ మధ్య ట్రోల్స్ అన్నవి ఎక్కువా అయ్యాయి కదా , ఇంతకు ముందు ట్రోల్స్ గురించి బాధ పడేదాన్ని .. కానీ ఇప్పుడు లైట్ తీసుకుంటున్నా. 

@  లిప్ లాక్ గురించి ... 

నిజానికి లిప్ లాక్ ఉటుందని ముందు  తెలియదు. ఆ సీన్ తీసాక నాకు చెప్పారు . అయినా లిప్ లాక్ , హాగ్, రొమాన్స్ లాంటి విషయాలన్నీ కూడా నటనలో భాగమే .. అంతే కానీ అవి ప్రత్యేకం అని నేను అనుకోను. సినిమాల విషయంలో నాకు సెట్స్ లో కెమెరా స్టార్ అయ్యాకా ముందు వెనక ఎవరున్నారన్నది మరచిపోతా. నటనలో నా పాత్ర ఏమిటో అదే చూస్తా.  నాకు కథ, పాత్రే ముఖ్యం. ఇక ప్రతి సినిమా నా మొదటి సినిమాగా భావిస్తా. దూకుడు సమయంలో మహేష్ ఇదే చెప్పాడు. ఎప్పుడు కూడా ప్రతి సినిమాను నీ మొదటి సినిమాలాగే భావించాలి అని చెప్పారు. నాకు అది బాగా నచ్చింది. నేను కూడా అదే ఫాలో అవుతా. 

 @ సినిమాలు తగ్గాయని... 

ఎందుకు తగ్గుతాయి. ఇప్పటికే చాలా అవకాశాలు వస్తున్నాయి .. కానీ అన్ని రెగ్యులర్ కమర్షియల్ కథలే కావడంతో భిన్నమైన పాత్రలు చేయాలని ఒప్పుకోవడం లేదు .. సూపర్ డీలక్స్, యు టర్న్ తరహాలో నా పాత్రకంటూ ప్రత్యేకత ఉండాలన్నది నా కోరిక.  
 బాలీవుడ్ నుండి అవకాశాలు రాలేదు ..  వాళ్లకు నేను కరెక్ట్ కాదనుకున్నారేమో  నెక్స్ట్ సినిమా  తెలుగులో 96 రీమేక్ ఉంటుంది. దాంతో పాటు కథలు వింటున్నా. 
 

Recent reviews

LATEST NEWS

ACTRESS GALLERY