మెగా డాటర్ నిహారిక ఇంటర్వ్యూ

28 Mar,2019

ఎన్నికల్లో ప్రచారం చేస్తా - మెగా డాటర్ నిహారిక 

మెగా ఫ్యామిలి నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక తోలి సినిమా ఒక మనసు ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. అయినా నిహారిక నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఆ తరువాత హ్యాపీ వెడ్డింగ్ అంటూ రెండో ప్రయత్నం చేసింది .. ఇప్పుడు సూర్యకాంతంగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తుంది.  నిహారిక, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో ప్రణీత్ బ్రమండపల్లి దర్శకుడిగా పరిచయం అవుతూ తెరెక్కిన చిత్రం ' సూర్యకాంతం' . రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన‌ ఈ సినిమాను  నిర్వాణ సినిమాస్ నిర్మించింది.  ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా నిహారిక చెప్పిన విశేషాలు .. 
ఈ సూర్యకాంతం  న‌చ్చిన వాళ్ల‌తో ప‌క్ష‌పాతంగా ఉంటూ, మిగిలిన వాళ్ల‌ను సాధించే పాత్ర‌. చాలా స్ట్రెయిట్ ఫార్వ‌ర్డ్ గా ఉంటుంది. సూర్య‌కాంతంలాగా  చేతి వాటం చూపించాలని ట్రై చేశా కానీ కుదరలేదు ..అక్క‌డ‌క్క‌డా ప్ర‌య‌త్నించాను. ఈ కథ ఎలా వచ్చిందంటే ..  ఒక‌రోజు ఈ కథను దర్శకుడు ప్రణీత్ చెప్పాడు . నాకు బాగా నచ్చింది. ఆ తరువాత కథను విన‌మ‌ని అన్న వరుణ్ ని అడిగా. తనకు కూడా చాలా బాగా నచ్చడంతో  నిర్వాణ సినిమాస్ వారితో మాట్లాడి సెట్ చేశారు. ఆయ‌న కూడా స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు.  ఇక విడుదల విషయంలో టెన్షన్ ఏమి లేదు ..  బ‌య‌ట ఎలాగూ ఎన్నిక‌ల వేడి ఉంది. దానిలో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఈ సినిమా చూసి ఆస్వాదిస్తార‌ని అనుకుంటున్నాం. చాలా వ‌ర‌కు ఎగ్జామ్స్ కూడా అయిపోయాయిగా. సినిమా పై పూర్తీ నమ్మకమైతే ఉంది. చూద్దాం ఏమి జరుగుతుందో. 

 సెట్స్ లో సూర్యకాంతం అని కాదు   కాంతం అని పిలిచేవారు .. అయితే ఇంట్లో మాత్రం నాన్న సూర్యకాంతం అని పిలుస్తాడు. నిజానికి ఇది ఈ సినిమా కంటే ముందే జరిగింది. నేను మా నాన్న క‌లిసి నాన్న‌కూచి అని ఓ వెబ్ సీరీస్ చేశాం. అందులో మా నాన్న నా గురించి ఆయ‌న గ‌ర్ల్ ఫ్రెండ్‌కి వివ‌రించే సీన్ ఉంటుంది. `మా అమ్మాయి సావిత్రి టైపు` అని ఆయ‌న‌కు డైలాగ్ రాశారు. కానీ మా నాన్న `మా అమ్మాయి సావిత్రి కాదు  సూర్యకాంతం` అని అన్నారు. ఆ స‌మ‌యంలో నేను, మా ద‌ర్‌వకుడు ప్ర‌ణీత్ కూడా అక్క‌డే ఉన్నాం. ఒక‌వేళ ప్ర‌ణీత్ ఆ విష‌యాన్ని గుర్తుపెట్టుకుని సూర్యకాంతం అని ఈ సినిమాకు పేరు పెట్టాడేమో నాకు తెలియ‌దు. 

సినిమాలు స‌రిగ్గా ఆడలేదున్న ఫీలింగ్  కచ్చితంగా లేదు. ఒక సినిమా ఆడితే ఎగిరిగంతేసి, ఆడ‌క‌పోతే విసుక్కునే ర‌కం కాదు నేను. నా ప‌నిని నేను సంపూర్ణంగా చేశానా లేదా అనేది నాకు కీల‌కం. ఎందుకంటే నేను ఏ ప‌నినీ అర‌కొర‌గా చేయ‌ను. పూర్తిగా  మ‌న‌సు పెట్టి చేస్తా. రెండు సినిమాల్లోనూ `నీహారిక బాగా చేయ‌లేదు` అని ఎవ‌రూ చెప్ప‌లేదు. కథ విషయంలో బాగుందన్న టాక్ విన్నాం .. కానీ మేకింగ్ విషయంలో ఎక్కడో తేడా జరిగి ఉంటుంది.  అయినా కొన్ని సినిమాలుఆడ‌లేదు. సినిమా ఫ్లాప్ కావ‌డానికి స‌రైన రిలీజ్ టైమ్ నుంచి ఎన్నెన్నో కార‌ణాలు ఉంటాయి. వాటిని ఎప్పుడు గుర్తుపెట్టుకుని టెన్షన్ పడను.  అలాగే   సీనియర్స్ తో పనిచేయడం,  ముక్యంగా   సుహాసిని గారితో పనిచేయడం చాలా ఎంజాయ్ చేశాను. ఆమె మాతో చాలా బాగా క‌లిసిపోయారు. మామూలుగా కాస్త సీనియ‌ర్ల‌తో కాసేపు మాట్లాడిన త‌ర్వాత అక్క‌డి నుంచి వెళ్లిపోవాల‌నిపిస్తుంది నాకు. కానీ ఆవిడ‌కు సినిమా మీద ప‌ట్టు, మ‌ణిరత్నంగారి గురించి చెప్పిన విష‌యాలు న‌న్ను క‌ట్టిప‌డేశాయి. మా నాన్న తో ఆవిడ సినిమాలు చేశార‌ట‌. ఆ విష‌యాలు చాలా బాగా చెప్పారు. మా అమ్మ కూడా సెట్‌కు వ‌చ్చి ఆవిడ‌ను క‌లిశారు. నేను పుట్ట‌క‌ముందు విష‌యాల‌ను వాళ్లు చాలానే మాట్లాడుకున్నారు.

 నటన విషయంలో నేను సీరియస్ గా ఉన్నా నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. ముందు నేను న‌టించ‌డానికి రావాల‌నుకున్న‌ప్పుడు మా కుటుంబాన్ని ఇష్ట‌ప‌డే అభిమానులు అభ్యంత‌రం చెప్పారు. కానీ నా మ‌న‌సులో ఉన్న విష‌యాన్ని క్లియ‌ర్‌గా చెప్పే స‌రికి అర్థం చేసుకున్నారు. మొద‌ట సినిమాలు చేద్దామ‌నే అనుకున్నా. కానీ ఇప్పుడు సినిమాలు చేస్తూ పోతుంటే నాకు ఇంకా చాలా చేయాల‌ని ఉంది. త‌ప్ప‌కుండా యాక్టింగ్‌ను నేను సీరియ‌స్‌గానే తీసుకుంటున్నా. అలాగే  నిర్మాణ రంగంలో బాగా ఆసక్తి  మా నాన్న‌గారు, మా అర‌వింద్ మామ నిర్మాణం చేస్తుంటే చూస్తూ పెరిగా. నేను ఏ విష‌యాల‌ను గాలికి వ‌దిలేయ‌ను. అంత తేలిగ్గా అవ‌త‌లివారిని న‌మ్మి వ‌దిలేయ‌ను. అన్నిటినీ ద‌గ్గ‌రుండి చూసుకుంటాను. చ‌క్క‌టి ప్ర‌ణాళిక ఉంటుంది. అవ‌న్నీ నాకు నిర్మాణానికి ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. డిజిట‌ల్‌లో పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ పేరుతో మేకింగ్ జ‌రుగుతోంది. ప్రస్తుతం అమృతం తరహాలో ఓ సిరీస్ చేస్తున్నాము. ప్రస్తుతం వంద ఎపిసోడ్స్ ప్లాన్ చేసాం. ముందు ముందు సినిమాలు కూడా తీయొచ్చు. 

 సైరా లో  నా పాత్ర షూటింగ్ చేశా. కానీ  నాకు డైలాగులు ఉండ‌వు. ఒక‌ట్రెండు సీన్ల‌లో క‌నిపిస్తా. కానీ త‌ప్ప‌కుండా నోటీస్ చేసే సినిమా అవుతుంది. ముక్యంగా పెదనాన్న చిరంజీవి తో నటించనన్న సంతృప్తి మిగిలింది.  అలాగే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమా గురించి ఆలోచించలేదు. నిజానికి నా గురించి వ‌చ్చిన రూమ‌ర్స్ కి చెక్ పెట్ట‌డానికి ఆయ‌న స్టేజ్ మీద అలా ప్ర‌క‌టించారు.  


  `క‌ర్త‌వ్యం` త‌ర‌హా సినిమాలు చేయ‌లని అడుగుతున్నారు .. కోడి రామ‌కృష్ణ‌గారు అప్పట్లో  నాతో అన్న మాట‌లు అవి. ఆయ‌న గుర్తుకొచ్చిన‌ప్పుడ‌ల్లా అవే గుర్తుకొస్తాయి. `సూర్య‌కాంతం` విడుద‌లైన త‌ర్వాత న‌న్ను దృష్టి లో పెట్టుకుని కొత్త తరహా పాత్రలు రాస్తారని అనుకుంటుంన్నా.  అంతే కానీ నాకు ఇలాంటి పాత్రలు రాయండని ఎవరిని అడగను. 

 ఎన్నికల్లో ప్ర‌చారం చేస్తా.  ఈ సినిమా విడుద‌ల‌య్యాక త‌ప్ప‌కుండా వెళ్లి ప్ర‌చారం చేస్తా. కాక‌పోతే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇక పెళ్లంటారా .. 30ఏళ్ల‌లోపు పెళ్లి చేసుకుంటా  ప్ర‌స్తుతం నా దృష్టి యాక్టింగ్ మీద ఉంది. 

Recent reviews

LATEST NEWS

ACTRESS GALLERY