హీరోయిన్ దివ్యంక కౌశిక్ ఇంటర్వ్యూ

27 Mar,2019

హీరోయిన్ దివ్యంక కౌశిక్ ఇంటర్వ్యూ 
 
నాగ‌చైత‌న్య‌, స‌మంత‌, దివ్యాంశ కౌశిక్‌ హీరో హీరోయిన్స్‌గా శివ నిర్వాణ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న చిత్రం `మ‌జిలీ`. షైన్ స్కీన్స్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 5న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా దివ్యాంశ కౌశిక్‌తో ఇంట‌ర్వ్యూ....

నేప‌థ్యం... 
- మాది ఢిల్లీ. మూడేళ్లుగా ముంబైలో ఉంటున్నాను. న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకున్న త‌ర్వాత పోర్ట్ ఫోలియో సిద్ధం చేసుకుని అవ‌కాశాల కోసం చూస్తున్నాను. ఆడిష‌న్స్‌కు వెళ్లేదాన్ని. అలా ఆడిష‌న్స్‌లో `మ‌జిలీ` సినిమాకు ఎంపిక అయ్యాను. నా తొలి చిత్రం సిద్ధార్థ్‌తో చేస్తున్నాను. అది మే లేదా జూన్‌లో విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. తెలుగులో `మ‌జిలీ` నా తొలి చిత్రం. ముంబైలో శిక్ష‌ణ స‌మ‌యంలో వ‌ర్క్‌షాప్స్‌లో పాల్గొన్నాను. ఫెయిర్ అండ్ ల‌వ్ లీ, పాన్‌టీన్ షాంపు, హీరో హోండా బైక్ వంటి క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లో న‌టించాను. 


 పాత్ర ....
-  నా పాత్ర పేరు అన్షు. చైత‌న్య‌ను ప్రేమించే అమ్మాయి పాత్ర‌లో క‌నిపిస్తాను. ఇంత కంటే నా పాత్ర గురించి ఏమీ చెప్ప‌లేను. చైత‌న్య‌తో వ‌ర్క్ చేయ‌డం చాలా హ్య‌పీ. డౌన్ టు ఎర్స్ ప‌ర్స‌న్‌. అమేజింగ్ కోస్టార్‌. 

తెలుగులో..

 ప్ర‌స్తుతానికి తెలుగు కాస్త‌ అర్థం చేసుకోగ‌ల‌ను. కానీ... మాట్లాడ‌లేను. త‌మిళ్‌లో న‌టించ‌డం తెలుగుతో పోల్చితే కొంచెం క‌ష్టంగా అనిపించింది. ఇక్కడ యూనిట్ బాగా స‌పోర్ట్ చేశారు. న‌టిగా స‌మంత అంటే ఇష్టం. ఆమెతో క‌లిసి న‌టించ‌లేదు. 

ద‌ర్శ‌కుడు శివ గురించి...

- డైరెక్ట‌ర్ శివగారు ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. ఆయ‌న ఇచ్చిన స్వేచ్ఛ‌తోనే బాగా న‌టించాను. డైరెక్ట‌ర్‌గా న‌న్ను గైడ్ చేయ‌డ‌మే కాకుండా నాలో కాన్ఫిడెన్స్‌ను పెంచారు.


ఆలాంటి సినిమాలు...

- నా పాత్ర తీరు తెన్నులు, పాత్ర గ్రాఫ్ నాకు న‌చ్చింది. అందుక‌నే న‌టించాను. కంటెంట్ ఉన్న సినిమాలే కాదు.. గ్లామ‌ర్ పాత్ర‌లు చేయ‌డానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ద‌ర్శ‌కుడు సినిమాను అద్భుతంగా మ‌లిచారు. చిన్న చిన్న స‌న్నివేశాల‌ను కూడా అద్భుతంగా మ‌లిచారు. ప్ర‌తిరోజూ మ‌నం ఫేస్ చేసే విష‌యాల‌ను కూడా చ‌క్క‌గా ఎలివేట్ చేశా

 ఇన్‌స్పిరేష‌న్...

- బాలీవుడ్‌లో ఆలియా భ‌ట్, క‌రీనా క‌పూర్‌, అనుష్క శ‌ర్మ‌ల‌ను ఇష్ట‌ప‌డ‌తాను. ఇక్క‌డ స‌మంత న‌ట‌నంటే ఇష్టం. కొన్ని చిత్రాలు డిస్క‌ష‌న్ ద‌శ‌లో ఉన్నాయి. వాటి వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాను.

Recent reviews

LATEST NEWS

ACTRESS GALLERY