హీరో ఆదిత్ అరుణ్ ఇంటర్వ్యూ

20 Mar,2019

 కెరీర్ సంతృప్తిగా ఉంది - హీరో ఆదిత్ అరుణ్  
 

కథ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన  ఆదిత్ అరుణ్ ఆ తరువాత పలు భిన్నమైన సినిమాలు చేసి యంగ్ హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజాగా అడల్ట్ కామెడీ కంటెంట్ తో తెరకెక్కి  ట్రైలర్ తో సెన్సేషన్ సృష్టించిన చిత్రం చీకటి గదిలో చితక్కొట్టుడు. అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 21న విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో ఆదిత్ అరుణ్ చెప్పిన విశేషాలు ..  

కథ నచ్చింది .. 

ఈ సినిమా  కథ గురించి చెప్పాలంటే .. ఒక అబ్బాయి పెళ్లి కోసం అమ్మాయిని వెతుకుతూ ఉంటాడు ఆ క్రమంలో ఎలాంటి సంఘటనలు ఎదురుకున్నారు అనే నేపథ్యంలో ఉంటుంది. సినిమా చూసి చాలా నవ్వుకుంటారు. ఇక టైటిల్ పై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి .. నిజానికి ఈ టైటిల్ పెట్టడానికి  కారణం  ఈచిత్రానికి కరెక్ట్ గా సరిపోతుంది. హారర్ కామెడీ స్టోరీ కాబట్టి ఆ టైటిల్ పెట్టాం. కానీ సినిమాలో డబుల్ మీనింగ్స్ డైలాగ్స్ , కామెడీ తప్ప ఫీజికల్ గా అసభ్యకరంగా అయితే ఉండదు. ఒక సినిమాకు మంచి టైటిల్ పెట్టారు .. వెళ్లి చుస్తే .. సినిమా మొత్తం బూతులతోనే ఉంది .. అలా ప్రేక్షకులను మోసం చేయడం ఇష్టం లేక .. ఈ టైటిల్ పెట్టేసాం .. తమిళంలో ఇదే టైటిల్ తో తెరకెక్కిన ఈ ఇసినిమా అక్కడ సంచలన విజయాన్ని అందుకుంది. 

సరదాగా .. 
 
ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం కొత్త పాయింట్ .. నేను ఇదివరకు చాలా సినిమాలు చేశాను .. అన్ని కూడా భిన్నమైన సినిమాలు. అయితే నా కెరీర్ లో అతి తక్కువ సమయంలో కంప్లీట్ చేసిన సినిమా ఇదే. ఈ చిత్రానికి కేవలం 19 రోజులు మాత్రమే తీసుకున్నాను. ఇదేమి గొప్ప సినిమా అని చెప్పను .. కానీ యూత్ సరదాగా నవ్వుకునేలా ఉంటుంది. అన్నట్టు ఇది డబ్బులకోసం కూడా చేయలేదు అందుకో కథ నాకు బాగా నచ్చింది.  చేస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేశా.

సరైన సక్సెస్ .. 

 సరైన బ్రేక్  రాలేదని అంటున్నారు .. కొన్ని సినిమాలు ఆడుతాయి. కొన్ని అడవు. నేను సక్సెస్ ల గురించి ఆలోచించను. మంచి సినిమా చేశామా లేదా, చేస్తుంది కరెక్ట్ గా చేశామా అని మాత్రమే ఆలోచిస్తాను. ఇండస్ట్రీ లో నా ఏజ్ వున్నవారు కొందరు ఇప్పటికి సినిమాలు లేక ఖాళీగా వున్నారు. అలాగని సక్సెస్ అవసరం లేదని చెప్పను. కానీ నేను ఇంకా హీరోగా ఉన్నందుకు ఆనందంగా ఉంది .. ఇక్కడ ఒక్కరే మెగాస్టార్.. ఒక్కరే సూపర్ స్టార్ ఉంటారు .. అందరు స్టార్స్ అవ్వలేరు. 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్ .. 
 
ఇక తదుపరి చిత్రాలు గురించి చెప్పాలంటే ప్రస్తుతం డ్యూడ్ అనే చిత్రాన్ని చేస్తున్నాను. ఫ్రెండ్షిప్ నేపథ్యంలో ఉంటుంది. ఈ సినిమా లో నాతో పాటు ప్రిన్స్ , ప్రియదర్శి కూడా నటిస్తున్నారు. దాంతో పాటు  మరో రెండు చిత్రాలకు సైన్ చేశాను. అలాగే తమిళంలో కూడా అవకాశాలు వస్తున్నాయి. 

Recent reviews

LATEST NEWS

ACTRESS GALLERY