సూపర్ స్టార్ మమ్ముట్టి ఇంటర్వ్యూ 

02 Feb,2019

 సినిమాకోసం ఎంతైనా కష్టపడతా - ప్రముఖ నటుడు మమ్ముట్టి 

మమ్ముట్టి .. అయన గురించి చెప్పడానికి  కొత్తగా ఏమిలేదు .. అందరికి తెలిసిన గొప్ప నటుడు. ఇండియన్ సినిమా చరిత్రలో లెజెండ్ గా ఇమేజ్ తెచ్చుకుని సూపర్ స్టార్ లలో ఒకరిగా ఎదిగిన గొప్ప నటుడు మమ్ముట్టి. ఒక్క మలయాళ పరిశ్రమకే పరిమితం కాకుండా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటించి ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. చాలా కాలం తరువాత అయన తెలుగు స్ట్రైట్ సినిమా యాత్రలో నటిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథగా తెరకెక్కిన ఈ సినిమాకు మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ చిత్రం ఈ నెల 8న విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రముఖ నటుడు మమ్ముట్టి తో ఇంటర్వ్యూ .. 

చాలా గ్యాప్ తరువాత 
 
తెలుగులో చేయడానికి నిజంగానే చాలా టైమ్ పట్టింది. దానిక్ వున్నా ఒకటే కారణం .. నాకు  తగ్గ స్క్రిప్ట్ దొరకపోవడమే. స్క్రిప్ట్ బావుంటే ఎనీ టైమ్ సినిమా చేయడానికి నేనెప్పుడూ రెడీ. నా ఇన్నేళ్ల కెరీర్ లో దాదాపు 70 మంది కొత్త డైరక్టర్స్ తో పని చేశాను. నిజానికి ఈ దర్శకుడు  మహి అప్పటికే 2 సినిమాలు చేసి ఉన్నాడు. కొత్త డైరెక్టర్స్ అనగానే వీళ్ళేదో కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తారనే అనిపిస్తుంది. అందుకే వారితో చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తా. 

యాత్ర కు కారణం

ఒక్కటే కారణం కాదు .. ముక్యంగా స్క్రిప్ట్, దాంతో పాటు తపన ఉన్న నిర్మాత, వై ఎస్ లాంటి  లెజెండ్రీ పాత్ర. ఒక సినిమా ఓకె చెప్పడానికి ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయనిపించింది కాబట్టే ఈ సినిమా చేశా.  వై ఎస్ పాదయాత్ర అంటే జస్ట్ అలా నడవడమే కాదు. జనాల్ని కలవడం, వారి గురించి తెలుసుకోవడం. జనాల సమస్యలు వినడం,  ఆ జర్నీలో ఆయన అనుభవాలు, ఎమోషనల్ ఫేజ్ మొత్తం మీరు ఈ  ‘యాత్ర’లో చూస్తారు. ఇది పూర్తీ గా వై ఎస్ జీవిత కథ కాదు .. ఒక ఫేజ్. అంటే అయన ముఖ్యమంత్రి అయ్యేముంది చేసిన పాదయాత్ర నేపథ్యంలో ఉంటుంది. 

రాజకీయాలకు ఆస్కారం లేదు  

 సినిమా కేవలం వై ఎస్ అయన పాదయాత్రలో చేసిన పనులు, ఆ యాత్ర నేపథ్యంలో జనాలను కలవడం. వారి సమస్యల నేపథ్యంలో మాత్రమే కథ సాగుతుంది.  వై ఎస్ గారిది కంప్లీట్ గా డిఫెరెంట్ పర్సనాలిటీ. ఒకవేళ నేను ఆయనలా కనిపించే ప్రయత్నం చేసినా కుదిరేది కాదు. అందుకే ఆయన కథ, వ్యక్తిత్వాన్ని మాత్రమే ఎంచుకున్నాం. హావ భావాలు కాదు. ఎందుకంటే ఈ సినిమాలో అయనలాగే  ఉండాలన్న మిమిక్రి  ఏమి చేయలేదు.  ఈ పాత్ర ని ప్లే చేయడానికి పెద్దగా ఏమీ కష్టపడలేదు. దర్శకుడు మహి సినిమాకి కావాల్సిన రీసర్చ్ చేసి, స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు.  మహి రాసుకున్నది, అతనికి ఎం కావాలో అదే చేసా.  

పాలిటిక్స్ పై  
 
దాదాపు ముప్పై ఏళ్లకు పైగా సినిమాల్లో ఉన్నాను. సినిమాలే నా ప్రపంచం, అవే నా పోలిటిక్స్…

 ఈ మధ్య  తెలుగు సినిమాలే కాదు అన్ని బాషల చిత్రాల్లో మార్పు వచ్చింది. ముక్యంగా తెలుగు సినిమాల్లో ప్రేక్షకుల అభిరుచి మారింది. కొత్త కొత్త కథలను వారు అంగీకరిస్తున్నారు. ఈ మద్యే   రామ్ చరణ్ ‘రంగస్థలం’, మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమాలు చూశాను. యూట్యూబ్ లో తెలుగు వీడియోస్ కూడా చూస్తుంటాను. తెలుగు సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ విషయంలో పోటీ పడుతున్నాయి. నిజంగా ఇది మంచి పరిణామం.  నేను గత 33 ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నాను .. ఇప్పటికే 370 కి పైగా సినిమాలు చేసాను .. నేను చేసే ప్రతి రోల్ నా డ్రీమ్ రోలే. నాకు తెలిసి ఏ యాక్టర్ అయినా తను కంఫర్ట్ గా ఫీలయ్యే క్యారెక్టర్ ని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కంఫర్ట్ గా ఫీలయ్యేవే డ్రీమ్ రోల్స్ అనే నా ఫీలింగ్. 
 
 వై ఎస్ ఫ్యామిలీ నుండి   

వై ఎస్ ఆర్ పార్టీ నుండి కానీ అయన ఫ్యామిలీ నుండి కానీ  ఎవరూ కలవలేదు. సినిమా బిగిన్ మొదలయినప్పటి నుండి  నేను డైరెక్టర్, ప్రొడ్యూసర్ తో టచ్ లో ఉన్నాను. వాళ్ళను కూడా ఎవరు కలవలేదని చెప్పారు.  నాకు టాలీవుడ్ లో కూడా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. గతంలో సినిమాలన్నీ చెన్నై లోనే జరిగేవి కాబట్టి, అప్పుడూ కలుస్తూనే ఉండేవాళ్ళం. ఇప్పటికీ ఆ పరిచయాలున్నాయి. నేను 80 బ్యాచ్ కాదు 2018 బ్యాచ్ దుల్కర్ తో నాకు పోటీ లేదు .. తనతో కలిసి నటించే ఆలోచన కూడా లేదు. సినిమా అనేది నా ప్యాషన్ . దానికోసం ఎంతైనా కష్టపడతా. నచ్చిన స్క్రిప్ట్స్ లను చేసుకుంటూ వెళ్లడమే నా పని.  చాలా కాలం కిందట  విశ్వనాధ్ తో స్వాతికిరణం చేశా .. మళ్ళీ ఇన్నాళ్లకు యాత్ర చేస్తున్నాను .. మళ్ళీ మంచి స్క్రిప్ట్ వస్తే ఇప్పుడు కూడా రెడీ . 

Recent reviews

LATEST NEWS

ACTRESS GALLERY