అఖిల్ అక్కినేని ఇంటర్వ్యూ

24 Jan,2019

మజ్ను బ్రాండ్ మాదే - అఖిల్ అక్కినేని

అక్కినేని చిన్నోడు అఖిల్ , నిధి అగర్వాల్ జంటగా తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మిస్టర్ మజ్ను’. ఈనెల 25 న విడుదలకానుంది ఈ సందర్భంగా హీరో అఖిల్ చెప్పిన విశేషాలు....

@ కథ నచ్చింది...

ఈ కథ వినగానే నచ్చేసింది. ఎందుకంటే ఇది ఒక పాత్ర నేపథ్యంలో సాగే కథ. ఆ క్యారెక్టరైజేషన్ నాకు చాలా ఎగ్జైటింగ్ గా ఛాలెంజింగ్ గా అనిపించింది. నేను ఇంతకుముందు చేసిన రెండు సినిమాలకి ఇది పూర్తిగా బిన్నంగా ఉంటుంది. సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి ఎమోషన్ కూడా ఉంటుంది. 

@ దర్శకుడు గురించి... 

వెంకీ గుడ్ డైరెక్టర్ తో పాటు గుడ్ రైటర్ కూడా. తను డాడికి పెద్ద ఫ్యాన్. డాడి మూవీస్ ‘నిన్నే పెళ్లాడతా, మన్మధుడు’ లాంటి సినిమాల ప్రేరణతోనే ఈ సినిమా చేశాడు. వెంకీ నాకు చాలా కాలంగా తెలుసు. జస్ట్ కామన్ ఫ్రెండ్స్ ద్వారా చాల సార్లు కలిసాం. మజ్ను దగ్గర నుంచే తను నాకు క్లోజ్ అయ్యాడు.

@ స్పీడ్ గా జరిగింది...

‘హలో’కి స్క్రిప్ట్ విషయంలో చాలా వర్క్ చేశాం, అలాగే ఆ సినిమాకి షూటింగ్ డేస్ కూడా ఎక్కువ పట్టాయి. అఖిల్ కి కూడా అలాగే జరిగింది. కానీ ‘మిస్టర్ మజ్ను’ ఫుల్ స్క్రిప్ట్ తో వెంకీ రెడీగా ఉండటం వల్ల ఈ సినిమా కొంచం స్పీడ్ గా అయింది.

@ గత సినిమాల నుండి ...

నా బాడీ లాంగ్వేజ్ కావొచ్చు, డిక్షన్, యాక్షన్ కావొచ్చు ఇలా ప్రతి విషయంలో కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతో వెంకీ, నేను చాలా వర్క్ చేశాము. ఈ విషయం గురించే ‘మజ్ను’ ఈవెంట్ లో తారక్ అన్నయ్య చెప్పారు. ఎప్పటికప్పుడు మన పనిలో మనం ఆత్మ విమర్శ చేసుకోవడం మంచిది. నేను అలాగే విమర్శించుకుంటాను.

@ టైటిల్ విషయంలో..

మిస్టర్ అని పెట్టడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమి లేవు. కాకపోతే ఓన్లీ మజ్ను అని పెడితే కొంచెం ఎక్కడో ట్రాజడీ ఫీలింగ్ ఉంటుందేమో అని, వెంకీ మజ్నుకి ముందు మిస్టర్ అని పెట్టాడు. అలాగే మిస్టర్ పెట్టడం వల్ల, సినిమాలోతను ఒక మోడ్రన్ మజ్నును చూపించబోతున్నాడనే సెన్స్ ను కూడా హైలెట్ చెయ్యొచ్చు అనే ఆలోచన . 

@ మజ్ను ఫ్యామిలీ ..   

మజ్ను అనే టైటిల్ బాగా కలిసొచ్చింది మా ఫ్యామిలీకి. లైలా మజ్ను గా తాతగారు, మజ్ను గా నాన్న..ఇప్పుడు మిస్టర్ మజ్ను గా నేను.

@ లవ్ తో పాటు... 

ఒక్క మాటలో ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. యాక్షన్ పార్ట్ కూడా ఉంటుంది, 3 ఫైట్స్ ఉన్నాయి. .అలాగే సినిమాలో నాకూ, నా బాబాయ్ కి, నా పిన్నికి మధ్య వచ్చే ట్రాక్ కూడా చాలా బాగుంటుంది. 

@ ఎన్టీఆర్ నుంచి ఏదో ...

ఏదో కాదు, మాస్ నేర్చుకోమన్నారు. అదే ఎలా నేర్చుకోవాలో తెలియట్లేదు. ఇక ఎలా నేర్చుకోవాలి అని నాన్నగారినే అడగాలి. 

@ మ్యూజిక్ సూపర్ ..  

ఒక లవ్ స్టోరీకి మ్యూజిక్ ఏంత ఇంపార్టెంటో అందరికి తెలుసు. ఖచ్చితంగా తమన్ మ్యూజిక్ ‘మజ్ను’ను మరో లెవల్ కి తీసుకువెళ్తుంది. ఈ మధ్య తమన్ అందిస్తున్న సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్ అవుతున్నాయి. 

@  మల్టీస్టారర్స్  .. 

 గతంలోనే ఓ మల్టీస్టారర్ చెయ్యమని అడిగారు. కానీ అప్పుడు చెయ్యటం కరెక్ట్ కాదు అని చెయ్యలేదు. కథ నచ్చితే మాత్రం ఫ్యూచర్ లో  చేస్తాను. అలాగే స్పోర్ట్ నేపథ్యంలో ఓ సినిమా కూడా అడుగుతున్నారు. తప్పకుండా మంచి కథ కుదిరితే చేస్తా. 

@  తదుపరి చిత్రాలు .. 

ప్రస్తుతం నా దృష్టి అంతా పూర్తిగా ‘మిస్టర్ మజ్ను’ పైనే ఉంది. ఈ సినిమా విడుదలైన తరువాతే నా తదుపరి చిత్రం గురించి ప్రకటిస్తాను. ఈ సరి నెక్స్ట్ సినిమా దసరాకు ముందే  వచ్చేలా ప్లాన్ చేస్తా.  

Recent reviews

LATEST NEWS

ACTRESS GALLERY