Sai Pallavi Interview

26 Dec,2018

నా పాత్రకు ప్రత్యేకత ఉంటేనే - సాయి పల్లవి 

భానుమతి ఒక్కటే పీస్ అంటూ ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది మలయాళ భామ సాయి పల్లవి. వెండి తెరపై రాణించాలంటే అందాలు ఆరబోయాల్సిన అవసరం లేదు. అని ఇప్పటికే చాలా మంది నటీమణులు నిరూపించారు .. ఆ లిస్ట్ లోకి తాజాగా  చేరింది సాయి పల్లవి. తాజాగా ఆమె శర్వానంద్ తో కలిసి హను రాఘవపూడి దర్శకత్వంలో  నటించిన పడి పడి లేచే మనసు చిత్రం ఇటీవలే విడుదలై మంచి హిట్ టాక్ తో రన్ అవుతున్న సందర్బంగా సాయి పల్లవి చెప్పిన విశేషాలు ..  

రెండు సినిమాలు ..  

ఇటు తెలుగు, అటు తమిళ్‌లో రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడం అనేది నాకు కొత్తగా అనిపిస్తుంది. రెండు సినిమాలను ముందు నుండి సమాంతరంగా షూట్‌ చేస్తూ వస్తున్నాం. అలాగే రిలీజ్‌ కూడా ఒకేసారి అయ్యింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. 
మనం ఏదీ చేసిన మనస్ఫూర్తిగా చేయాలి. ఫలితాన్ని ఆ దేవుడికే ఇవ్వాలి. ఆయన ఏది ఇచ్చినా దాన్ని స్వీకరించాలి కదా. నటిగా రెండు సినిమాల నుండి ఫీడ్‌ బ్యాక్‌ పట్ల నేను హ్యాపీగా ఉన్నాను. ఏదీ జరిగినా మన మంచిదే అని ఫీలవుతాను. 

డామినేట్ లేదు  .. 

నటన నేర్చుకుని నేను సినిమాల్లోకి రాలేదు. వైశాలి అనే క్యారెక్టర్‌ ఎలా అబ్బాయిని ఇష్టపడుతుంది .. ఏమవుతుందనేదే కథ. నేను, శర్వా ఆ క్యారెక్టర్స్‌ను ఫీలై చేశాం. నటనలో ఇద్దరికీ ఫీలింగ్‌ ఉంటేనే అది తెరపై కనపడుతుంది. నేను ఎవరినీ డామినేట్‌ చేయను. డామినేట్‌ చేస్తానని ఎవరూ చెబుతున్నారో తెలియడం లేదు.

 శర్వతో ... 

 శర్వానంద్‌ పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. నేను సీనియర్‌, హీరోయిన్‌ జూనియర్‌.. మొన్ననే వచ్చింది కదా!, అనే ఫీలింగ్‌ తనకు ఉండదు. నాకు కంఫర్ట్‌ ఇచ్చారు శర్వా. నేను, తను మంచి స్నేహితులమయ్యాం. ఇద్దరికీ ఈగోలు లేవు. మేం ఎక్కడా ఇబ్బంది పడలేదు. తాను మంచి కో స్టార్. ఏంతో సపోర్ట్ ఇస్తాడు. 

ఆ జ్ఞాపకాలు ... 

ఈ సినిమాలో మెడికోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కొన్ని  సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు నాకు రెండేళ్ల ముందు జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. నా అనుభవాలే నన్ను ఇంత దూరం తీసుకొచ్చాయి. అలాంటి అనుభవాలను మరచిపోతే ఎలా? కాబట్టి అనుభవాలను మరచిపోకూడదనుకుంటాను. అలా మరచిపోతానేమో అనే భయం ఉంది. మెడిసిన్ విద్యార్థిగా కొనసాగుతుండగా  సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. దాంతో 2015లో ప్రేమమ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాను. ఆ సినిమా  సౌత్ లోనే మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.  

గ్లామర్ విషయంలో .. 
    
గ్లామర్ షో విషయంలో ఎవరి అభిప్రాయాలూ వారివి.అలాగని గ్లామర్ షోకు నేను వ్యతిరేకం కాదు.  వెండి తెరపై ఎక్స్ ఫోజింగ్ చేయడం నా వల్ల కాదు. అలాంటి సన్నివేశాల్లో నటించాలి అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను మెడిసిన్ చదువు వదిలేసి వచ్చింది నటిగా గుర్తింపు పొందడానికి. గ్లామర్ షోలు చేయడానికి కాదు. నటిగా కొనసాగినన్ని రోజులు మంచి పాత్రల్లో నటించడానికి ప్రయత్నిస్తా. నా సినిమాలు చూసి మా పేరెంట్స్ మంచి సినిమా చేసిందని అనుకోవాలి కానీ వాళ్ళు తల దించుకునేలా ఉండకూడదు. 

లిప్ లాక్ విషయంలో .. 
 
 లిప్ లాక్ సన్నివేశాలలో కూడా నేను నటించను. లిప్ లాక్ సీన్స్ తప్పుకాదు .. అది కథ ప్రకారం అయితే బాగుంటాయి .. అయితే నా వరకు మాత్రం లిప్ లాస్ సీన్స్ కు దూరం.  

తదుపరి చిత్రాలు .. 

ప్రస్తుతం తెలుగులో ఓ సినిమాకు చర్చలు జరుగుతున్నాయి. దాంతో పాటు తమిళంలో ఒకటి, మలయాళంలో మరో సినిమా ఉంది. 
 

Recent reviews

LATEST NEWS

ACTRESS GALLERY