బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు ఇప్పుడు రాజకీయాల పై ఆసక్తి కలిగినట్టుంది. ఈ మధ్యే మణికర్ణికా పేరుతొ ఓ సినిమా తీసి మంచి క్రేజ్ తెచ్చుకున్న కంగనా తాజాగా తమిళ నాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. తలైవి పేరుతొ తెరకెక్కే ఈ సినిమాకు ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అన్నట్టు ఈ సినిమాకోసం ఈ అమ్మడు భరతనాట్యం కూడా నేర్చుకుంటుందట !! ఈ సందర్బంగా ఓ కార్యక్రమంలో కంగనా మాట్లాడుతూ ఈ మధ్య రాజకీయాల్లో చాలా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఒక పార్టీ నుండి మరో పార్టీలోకి చేరికలు ఎక్కువవుతున్నాయి, ప్రస్తుతం నన్ను చాలా పార్టీలు రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానిస్తున్నాయి. మా తాత సర్జు సింగ్ రాజపుత్ హిమాచల్ ప్రదేశ్ లో పొలిటీషియన్ గా పనిచేసారు. అయన వారసత్వమే నాకు వచ్చిందేమో. నాకైతే ఒక పార్టీ తరపున ప్రచారం చేయాలన్న ఆలోచన లేదు, ఎందుకంటే అలా చేస్తే అన్ని వైపులా మాట్లాడే స్వేచ్ఛను కోల్పోతామని చెప్పింది. ఇప్పుడు మన అదృష్టం ఏమిటంటే ఇక్కడ రక్తపాతాలు లేవు .. కేవలాం బురద జల్లుకునే సంఘటనలే కనిపిస్తున్నాయి, ఒకవేళ భవిష్యత్తులో నేను రాజకీయాల్లోకి వస్తే నిస్వార్దంగా ప్రజలకు సేవ చేస్తానని చెప్పింది .