క్రేజీ దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఛార్మి సహా నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అప్పుడే సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు పూరి. ఈ సినిమా షూటింగు దశలో ఉండగానే 'డబుల్ ఇస్మార్ట్ ' టైటిల్ ను ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేయించాడు పూరి. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందించనున్నారు. రామ్ తో చేస్తోన్న 'ఇస్మార్ట్ శంకర్' హిట్ అయితేనే దానికి సీక్వెల్ ఉంటుందనీ, ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ఇలా 'డబుల్ ఇస్మార్ట్' టైటిల్ ను రిజిస్టర్ చేయించి ఉంటారని చెప్పుకుంటున్నారు.