15 Feb,2017

నంద‌మూరి తార‌క రామారావు, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు...వీరిద్ద‌రూ తెలుగు సినిమాకి రెండు క‌ళ్లు. ఒకరికొక‌రు పోటీప‌డిన‌ప్ప‌టికీ వీరిద్ద‌రూ క‌ల‌సి డ‌జ‌ను సినిమాల‌కు పైగా న‌టించారు. కానీ...ఈ మ‌హాన‌టుల వార‌సులు బాల‌కృష్ణ‌, నాగార్జున ఇప్ప‌టి వ‌ర‌కు క‌లిసి న‌టించ‌లేదు.

అయితే... ఎన్టీఆర్ జీవిత‌క‌థ‌ను సినిమాగా తీయ‌నున్నాను...ఈ చిత్రంలో తండ్రి ఎన్టీఆర్ పాత్ర పోషిస్తాను అని బాల‌కృష్ణ తెలియ‌చేసారు. ఎన్టీఆర్ జీవిత క‌థ అంటే...ఖ‌చ్చితంగా ఎ.ఎన్.ఆర్ పాత్ర ఉంటుంది. మ‌రి....ఎ.ఎన్.ఆర్ పాత్ర‌ను ఎవ‌రు పోషిస్తారు అనేదే ప్ర‌శ్న‌. బాల‌య్య ఎన్టీఆర్ జీవిత క‌థ‌తో సినిమా అని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి  ఎ.ఎన్.ఆర్ పాత్ర‌లో నాగార్జున న‌టిస్తే బాగుంటుంది అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇటీవ‌ల కొన్ని కార‌ణాల వ‌ల‌న బాల‌కృష్ణ‌, నాగార్జున మ‌ధ్య కాస్త దూరం పెరిగింది. అయిన‌ప్ప‌టికీ నాగార్జున గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి  స‌క్సెస్ కావాలి అని కోరుకుంటూ ట్వీట్ చేయ‌డం విశేషం. అభిమానులు కూడా నంద‌మూరి - అక్కినేని మ‌ల్టీస్టార‌ర్ కోసం ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్నారు. మ‌రి...ప్ర‌చారంలో ఉన్న‌ట్టు బాల‌కృష్ణ - నాగార్జున క‌లిసి న‌టిస్తే...నంద‌మూరి - అక్కినేని అభిమానుల‌కు పండ‌గే..!

Recent News