వైరముత్తుపై ఫైర్ అవుతున్న లేడి సింగర్ 

16 Apr,2019

సీనియర్ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ఆమె పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు .. దాంతో వెంటనే రియాక్ట్ అయిన ఖుష్బూ అతని రెండు చెంపలు చెళ్లుమనిపించింది. ఈ సంఘటనకు సంబందించిన వీడియొ వైరల్ అయింది.  తాజాగా ఈ వీడియొ ని ఓ నెటిజన్ సింగర్ చిన్మయికి పంపించారు .. ఈ మాటలు కేవలం చిన్మయి కోసమే మహిళలతో తప్పుగా ప్రవర్తించే వ్యక్తికీ ఖుష్బూ మేడం సరిగ్గా బుద్ధి చెప్పారు అంటూ కామెంట్ పెట్టాడు. ఆ ట్విట్ ని చుసిన చిన్మయి స్పందిస్తూ .. ఈ సారి ఖచ్చితంగా నాకు వైరముత్తు కనిపిస్తే రెండు చెంపలు పగలగొడతా ? అంటూ కామెంట్ పెట్టింది. అంతే కాదు ఈ వీడియొ చూస్తుంటే నాకోసమే అన్నట్టుగా ఉంది .. ఇలా చేస్తే తప్ప నాకు న్యాయం జరిగేలా లేదు అంటూ మరో కామెంట్ పెట్టింది. 

మొత్తానికి వీరిద్దరి చర్చలు మరోసారి మీ టూ వ్యవహారాన్ని గుర్తుచేసేలా ఉన్నాయి. సినిమా రంగంలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల పై పలువురు మహిళలు స్పందించారు .. మీ టూ అంటూ బాగా ప్రచారంలోకి వచ్చిన ఈ ఉద్యమం సమయంలో సింగర్ చిన్మయి కూడా తనను ప్రముఖ పాటల రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించాడని పేర్కొంది. ఈ విషయం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. అయితే ఈ విషయం పై ఇటీవలే జరిగిన ఓ అవార్డుల వేడుకలో చిన్మయి స్పందిస్తూ చిన్న పిల్లల పైన లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఈ విషయం పై మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారితో ఇలాంటివి కూడా చర్చించి జాగ్రత్తలు నేర్పించండి. 

నాతో వైరముత్తు లైంగిక వేధింపులు చేసారు. నేను న్యాయంకోసం ఎంతగా పోరాడిన సరైన న్యాయం మాత్రం దక్కలేదు అని పేర్కొంది. ఈ సారి అయన కనిపిస్తే మాత్రం రెండు చెంపలు వాయగొడతానని ఇలా సోషల్ మీడియా లో స్పందించింది. మరి ఈ ట్విట్ వైరల్ అవుతుందేమో చూడాలి.  

Recent Gossips