ప్రియాంకా కావాలంటున్న దర్శకుడు

11 Apr,2019

బాలీవుడ్  భామ ప్రియాంకా చోప్రా ఇటు బాలీవుడ్ లోన్ కాకుండా అటు హాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆమెతో సినిమాలు చేయడానికి పలువురు హాలీవుడ్ దర్శకులు ఆసక్తి చూపిస్తుండడం విశేషం. ఇక బాలీవుడ్ దర్శకులకైతే ఈ అమ్మడు అస్సలు దొరకడమే లేదట !! తాజాగా ఓ హాలీవుడ్ దర్శకుడు ఏకంగా తనకు ప్రియాంకా చోప్రాతో పనిచేయాలనీ కోరాడు ? ఇంతకి ఆ హాలీవుడ్ దర్శకుడు ఎవరో తెలుసా .. జో రుస్సో !! ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న '' ఎవెంజర్స్  ఎండ్ గేమ్'' చిత్రాన్ని తెరకెక్కించిన అయన ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ముంబై వచ్చిన అయన తన మనసులోని మాటను బయటపెట్టాడు. 

త్వరలోనే ప్రియాంకతో ఓ విషయం చర్చించబోతున్నాను అందేంటన్నది ఇప్పుడు చెప్పను అంటూ తెలిపాడు. ఇక భారతీయ సినిమాల గురించి మాట్లాడుతూ ఓ యాక్షన్ దర్శకుడిగా నాకు దబాంగ్ సిరీస్ ఇష్టమని చెప్పాడు. దబాంగ్, దబాంగ్ 2 సినిమాలు చూశానని తెలిపాడు. దబాంగ్ సినిమాలో సల్మాన్ ఎనర్జీ బాగా నచ్చింది అంటూ చెప్పేసాడు. ప్రస్తుతం ప్రియాంకా చోప్రా పెళ్లి తరువాత కూడా సినిమాలను కంటిన్యూ చేస్తుంది. ఇప్పటికే హిందీలో రెండు సినిమాలు చేస్తున్న ఆమె మరో హాలీవుడ్ చిత్రంలో కూడా నటిస్తుంది.

Recent Gossips