గోపీచంద్ సరసన కాజల్ ?

09 Apr,2019

గ్లామర్ భామ కాజల్  మెగాస్టార్ తో చేసిన ఖైదీ నంబర్ 150 సక్సెస్ తరువాత కాజల్ నటించిన సినిమాలన్నీ వరుస పరాజయాలు అందుకోవడంతో ఈ అమ్మడికి కొత్త అవకాశాలు కరువయ్యాయి. అటు తమిళంలో పరిస్థితి అలాగే ఉంది.  ఈ మద్యే కుర్ర హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన కవచం అట్టర్ ప్లాప్ అయినా మళ్ళీ అదే హీరోతో కలిసి సీత అనే సినిమా చేస్తుంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. తాజాగా యాక్షన్ హీరో గోపీచంద్ సరసన నటించేందుకు ఓకే చెప్పింది. అటు యాక్షన్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న గోపీచంద్ కు పరిస్థితి అలాగే ఉంది. ఈ మధ్య ఆయనకు వరుస పరాజయాలు టెన్షన్ పెడుతున్నాయి. దాదాపు అరడజను సినిమాలదాకా అదే పరిస్థితి. ఈ పరిస్థితిలో మార్పుకోసం గోపి కొత్త దర్శకులతో ప్రయోగాలకు సిద్ధం అయ్యాడు. ఇప్పటికే ఓ సినిమా చేస్తున్న అయన తాజాగా బిను సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పాడు. 

ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది. ఇందులో హీరోయిన్ గా అందాల భామ కాజల్ ని ఎంపిక చేశారు. గోపీచంద్ తో కాజల్ నటిస్తున్న మొదటి సినిమా ఇదే .   మరి గోపీచంద్ - కాజల్ ల కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. 

Recent Gossips