పెళ్లికి ముందే తల్లవుతున్న అమీ !

01 Apr,2019

ప్రముఖ నటి ఇటీవలే రోబో 2. 0 లో నటించిన అమీ జాక్సన్ ?  కొంతకాలంగా బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్‌ పనాయొటోతో డేటింగ్‌లో ఉంది బాలీవుడ్ న‌టి అమీజాక్స‌న్‌. న్యూ ఇయర్ సందర్భంగా వీరిద్దరికీ జాంబియాలో నిశ్చితార్థం అయింది. అయితే పెళ్లి మాత్రం ఇంకా చేసుకోలేదు. కానీ తాను తల్లి కాబోతున్నానంటూ, ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోవడానికి మాతృదినోత్సవానికి మించిన సరైన రోజు మరొకటి లేదని వెల్లడించింది. బ్రిటన్ లో నేడు మదర్స్ డే కావడంతో అమీ ఈ విషయం అందరితో పంచుకుంది. కాబోయే భర్తతో దిగిన ఫోటోను షేర్ చేసిన అమీ, ‘‘మీ అందరికీ ఈ విషయాన్ని అరిచి మరీ చెప్పాలని ఎదురుచూస్తున్నాను. ఈ విషయం చెప్పేందుకు మాతృదినోత్సవానికి మించిన సరైన రోజు మరొకటి ఉండదు. ఈ ప్రపంచంలో అందరి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను చూసేందుకు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం అని పోస్ట్ పెట్టింది. పోస్ట్ చూసిన నెటిజన్లు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

Recent Gossips