కుర్రహీరోతో పెళ్ళికి సిద్దమైన ఐటెం గర్ల్

30 Mar,2019

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వు . ... కేక..  అంటూ  ఐటెం గర్ల్ గా చిందేసిన బాలీవుడ్ భామ మలైకా అరోరా గుర్తుందా .. ? ఏంటి మరచిపోయేలా ఉందా ఆమె అంటారా !! నిజమే ఆ సాంగ్ తో కుర్ర కారు హృదయాల్లో గిలిగింతలు  పెట్టిన మలైకా అటు హిందీలో కూడా ఓ రేంజ్ లో గ్లామర్ షో లతో షాక్ ఇచ్చి పలు చిత్రాల్లో నటించింది.  ప్రస్తుతం ఈ అమ్మడు ఓ కుర్ర హీరోతో ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే.  బాలీవుడ్ లో ప్రకంపనలు క్రియేట్ చేస్తున్న ఈ వ్యవహారం త్వరలోనే ఓ కొలిక్కి రానుంది.  ఇప్పటికే పెళ్ళైన ఈమే కుర్ర హీరో అర్జున్ కపూర్ తో ఘాటు ప్రేమాయణం సాగిస్తూ పబ్బులు, క్లబ్బులు అంటూ నానా రభస చేస్తుంది. వీరిద్దరి వ్యవవహారం తెలియడంతో ఆమె భర్త సల్మాన్ ఖాన్ సోదరుడు ఆమె నుండి విడాకులు తీసుకున్నాడు. ఇక భర్త అడ్డు తప్పుకోవడంతో ఇంకా రెచ్చిపోయిన ఈ జంట చేసే హంగామాకు అంతే లేకుండా పోయింది. వీరిద్దరి వ్యవహారం పై ఇప్పటికే బాలీవుడ్ లో ఓరేంజ్  ప్రచారం జరుగుతుంది. మలైకా తో అర్జున్ కపూర్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటూ ముంబై మీడియా కోడై కూసింది .. అయినా వీరిద్దరి ఆ న్యూస్ కు బెదరలేదు. పైగా ఇంకా రెచ్చిపోయారు.  ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పెట్టేందుకు .. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటి కానున్నారట !! వచ్చే నెల ఏప్రిల్ 19న చర్చిలో పెళ్లి చేసుకుంటున్నట్టు సమాచారం. 

Recent Gossips