ఎఫైర్స్ ఉన్నాయంటూ షాకిచ్చిన లక్ష్మి రాయ్ 

21 Mar,2019

రత్తాలుగా పెరుతెచ్చుకున్న గ్లామర్ భామ  లక్ష్మీ రాయ్ ఈమధ్య 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. తాజాగా 'నీయా 2' అనే తమిళ చిత్రంలో నటిస్తున్న ఈ భామ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఆసక్తికర విషయాలు చేప్పి షాకిచ్చింది.  సోషల్ మీడియాలో లక్ష్మీ రాయ్ తరచుగా తన బికినీ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.  బీచ్ లో.. ఇతర అందమైన లోకేషన్లలో వీలైనంతగా అందాలను ధారపోస్తూ నెటిజనులకు హీటెక్కిస్తూ ఉంటుంది.  ఈ బికినీ ఫోటోల గురించి ప్రశ్నిస్తే.. 'నేను ఎక్కడికెళ్ళినా మెమొరీగా ఉంటుందని సెల్ఫీలు తీసుకుంటా. ఈమధ్య ముంబైలో ఉంటున్నా. అక్కడ బికినీ  అనేది చాలా కామన్.  నేను పోస్ట్ చేసింది ఆ ఫోటోలే. అవి పబ్లిసిటీ కోసం కాదు. నన్ను బికినీలో చూడడం ఇష్టం లేకపోతే కళ్ళు మూసుకోండి.' అంటూ గట్టిగా పంచ్ ఇచ్చింది. మీ లవ్ ఎఫైర్స్ గురించి ఎన్నో వార్తలు వస్తుంటాయి కదా అని అడిగితే.. 'నా జీవితంలో జరిగిన విషయాలను నేను దాచి పెట్టను.. ఆలాగని పబ్లిక్ గా చెప్పుకోను.  అయితే నేను చాలామందితో రిలేషన్లో ఉన్నమాట నిజమే' అంటూ బాంబు పేల్చింది.  అంతే కాదు.. 'వాటి గురించి చెప్పాలంటే టైం సరిపోదు' అంటూ మరో షాక్ ఇచ్చింది.  

Recent Gossips