నెగిటివ్ పాత్రలకు రెడీ అంటున్న తమన్నా 

20 Mar,2019

మిల్కి భామ తమన్నా .. మళ్ళి ఫామ్ లోకి వచ్చింది. ఆ మధ్య చేసిన అభినేత్రి సినిమా ప్లాప్ తో అవకాశాలు తగ్గిపోవడంతో కాస్త డల్ అయిన ఈ అమ్మడు లేటెస్ట్ గా ఎఫ్ 2 సంచలన విజయంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది.  ఇంతవరకూ తమన్నా అభిమానులు కోరుకున్నట్టుగానే గ్లామరస్ పాత్రలను చేస్తూ వచ్చింది. అయితే పెరుగుతోన్న పోటీ కారణంగా కొంతకాలంగా ఆమె తన రూటు మార్చుకుంది. ఈ నేపథ్యంలోనే  హారర్ సినిమాను కూడా చేసేసింది. తాజాగా ఆమె నెగెటివ్ రోల్ చేయడానికి కూడా అంగీకరించినట్టుగా తెలుస్తోంది .  గతంలో విశాల్ సరసన 'కత్తి సందై' చేసిన తమన్నా, ఆయన తాజా చిత్రంలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను చేయడానికి సిద్ధమవుతోంది. సుందర్.సి దర్శకత్వం వహించనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో కథానాయికగా మలయాళ నాయిక ఐశ్వర్య లక్ష్మి కనిపించనుందట. లైకా ప్రొడక్షన్స్  నిర్మిస్తోన్న ఈ సినిమా, ఏప్రిల్ చివరివారంలో సెట్స్ పైకి వెళ్లనుంది. మరి నెగిటివ్ పాత్రలో తమన్నా విశ్వరూపం ఎలా ఉంటుందో చూడాలి. 

Recent Gossips