రకుల్ కు మరో మెగా ఆఫర్

19 Mar,2019

రెండేళ్ళ క్రితం టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ జోరును చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేసేది.  వరసగా టాప్ హీరోల సినిమాలలో ఆఫర్లు సాధించి స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. కానీ వరస ఫ్లాపులు తన కెరీర్ పై ప్రభావం చూపించాయి.  మరోవైపు తమిళ.. హిందీ చిత్రాలను ఎక్కువగా యాక్సెప్ట్ చేయడంతో తెలుగు ఆఫర్లు తగ్గాయి.  మళ్ళీ ఇప్పుడు స్లోగా టాలీవుడ్ పై ఫోకస్ చేస్తోంది రకుల్. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ పేరును పరిశీలిస్తున్నారట.  తేజు ప్రస్తుతం 'చిత్రలహరి' సినిమాలో నటిస్తున్నాడు.  ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.  ఈ సినిమా తర్వాత మారుతి దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.  ఈ సినిమాను గీతా ఆర్ట్స్ వారు నిర్మించనున్నారు.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ సుమ్మర్ లోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తునారట.  మొదట తేజు సరసన రష్మిక మందన్న పేరుని పరిశీలించినా తన బిజీ షెడ్యూల్ కారణంగా కుదరడం లేదట. అందుకే రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా తీసుకుందామని డిసైడ్ అయ్యారట. అంతా అనుకున్నట్టు జరిగితే సాయి ధరమ్ తేజ్ - రకుల్ జోడీ ఫిక్స్ అయినట్టేనని సమాచారం.  

Recent Gossips