స‌రైన అబ్బాయి కోసం త్రిషా వెయిటింగ్

17 Mar,2019

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా దాదాపు దశాబ్దం పాటు ఏలిన గ్లామర్ భామ త్రిష ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు రెడీ అయింది. “రేపంటే రేపే పెళ్ళి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నాకు కావాల్సిన సరైన అబ్బాయి మాత్రం ఇంకా దొరకలేదని న‌టి త్రిష తెలిపింది. అది జరగ్గానే, నేనే నా పెళ్ళి గురించి పబ్లిక్ గా అనౌన్స్ చేస్తానని చెప్పింది. 2015 లో ఒకసారి ఎంగేజ్మెంట్ చేసుకొని.. కొన్ని కారణాల వల్ల ఆ రిలేషన్ లో నుండి బయటకు వచ్చింది త్రిష. అప్పటి నుండి సింగల్ అని చెప్తూ.. వరుస సినిమాలతో బిజీ గా ఉంది. ఈ మద్యే 96 అంటూ మంచి హిట్ తో మళ్ళి ఫామ్లోకి వచ్చేసింది. 

Recent Gossips