అక్కడే సమాధానం దొరుకుతుందంటున్న అమల పాల్

13 Mar,2019

గ్లామర్ గర్ల్ అమలా పాల్ కి ఎప్పుడు ఎలా ఉండాలో .. ఎలా ఉండకూడదో బాగా తెలిసినట్టుంది .. అందుకే ఆమె కావలసినప్పుడే లైమ్ లైట్ లోకి వచ్చేస్తూ నానా హంగామా చేస్తుంది.  ఈ డ‌స్కీ బ్యూటీ తాజాగా సోష‌ల్ మీడియాలో హాట్ బీచ్ ఫొటోలు పోస్ట్ చేసింది. అంతే కాదు త‌న‌కు ఎప్పుడు దిగులుగా అనిపించినా బీచ్‌కు చేరుకుంటాన‌ని అంటోంది. `మైనా` సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అమ‌ల తెలుగులో రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ స‌ర‌స‌న న‌టించింది. ఆ త‌ర్వాత కొన్ని అనువాద చిత్రాల ద్వారానూ తెలుగు ప్రేక్ష‌కుల‌ను పల‌క‌రించింది.  ఇప్పుడు ఓ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలో న‌టిస్తోంది. బీచ్ ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ ``ప్ర‌శ్న ఎలాంటిదైనా స‌రే దానికి బీచ్‌లో స‌మాధానం దొరుకుతుంది. బీచ్ పాఠ‌శాల‌లాంటిది. అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిస్తుంది. నాకు మ‌రిన్ని ఇబ్బందులు ఎదురైన‌ప్పుడు జీవితంలో మూడేళ్ల ముందు నీ ప‌రిస్థితి ఏంటి? అని ఆలోచిస్తాను అని చెప్పింది. మూడేళ్ల క్రితం ద‌ర్శ‌కుడు విజ‌య్‌తో అమ‌లాపాల్ విడాకులు తీసుకున్నా ఆమె ట్రావెలింగ్ , ట్రెక్కింగ్‌, బీచ్ లో స్కైడైవ్స్ మీద ఇష్టాన్ని పెంచుకుంది.
 

Recent Gossips