మెగా ఛాన్స్ కొట్టేసిన శృతి

08 Mar,2019

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భారీ బడ్జెట్ పీరియడ్ ఫిలిం 'సైరా' లో నటిస్తున్నారు.  ఈ సినిమా పూర్తి కాగానే చిరు - కొరటాల శివ కాంబినేషన్లో సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాలో ఒక కీలకమైన లేడీ క్యారెక్టర్ ఉందని ఆ క్యారెక్టర్ కోసం శృతి హాసన్ పేరును దర్శకుడు కొరటాల శివ పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ పాత్ర ఒక స్టార్ ఇమేజ్ ఉన్న నటి చేస్తేనే బాగుంటుందనే అలోచనలో కొరటాల శివ టీమ్ ఉందట. అందుకే శృతి హాసన్ పేరు తెరపైకి వచ్చిందట. ఇది కీలకమైన పాత్రే కానీ హీరోయిన్ పాత్ర కాదులెండి.   కానీ ఈమధ్య సినిమాలకు దూరంగా ఉంటున్న శృతి ఈ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది వేచి చూడాలి. శృతి గతంలో పవన్ కళ్యాణ్.. రామ్ చరణ్.. అల్లు అర్జున్ లతో  హీరోయిన్ గా నటించింది. మరో వైపు కొరటాల శివ  'శ్రీమంతుడు' సినిమాలో శృతి హాసనే హీరోయిన్.కాబట్టి ఈ సినిమాలో ఈ అమ్మడు నటించే ఛాన్స్ ఉంది .. పైగా మళ్ళీ హీరోయిన్ గా బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉంది కాబట్టి ఇలాంటి మెగా ఛాన్స్ కు నో చెప్పే ఛాన్స్ లేదు ఏమంటారు. 

Recent Gossips