ప్రేమలో ఉన్నానంటున్న  కంగన

06 Mar,2019

ఎప్పుడూ వివాదాస్పద విషయాలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్  కంగనా రనౌత్ తాజాగా 'మణికర్ణిక' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.   తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయం గురించి మీడియాతో పంచుకుంది. ‘‘నేను ప్రేమలో లేని రోజంటూ లేదు. నా జీవితంలో ప్రేమ విషయంలో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నా. కానీ వాటి నుంచి వెంటనే బయటపడిపోయాను. ఇప్పుడు నా జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పుకొచ్చింది కంగనా. గతంలో కంగనా రనౌత్ లవ్ స్టోరీస్ గురించి రకరకాలుగా ప్రచారం జరిగిన విషయం తెల్సిందే. కంగనా ఇటీవల కాలంలో మాత్రం ప్రేమలో పడ్డ దాఖలాలు లేవు. కాని ఆమె స్వయంగా ప్రస్తుతం తాను ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఆ వ్యక్తి ఎవరు అనే విషయంపై క్లారిటీ ఇవ్వని కంగనా పెళ్లి చేసుకుని కుటుంబ జీవితాన్ని కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. కంగనాకు సంబధించిన ఈ విషయాలు ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి.  ప్రస్తుతం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ‘మెంటల్ హై క్యా’లో కంగనా రనౌత్‌ నటిస్తోంది.

Recent Gossips