జానకిదేవి గా మారిన తమిళ 96

04 Mar,2019

తమిళంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన '96' సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా ను తెలుగులో నిర్మిస్తుండగా తమిళ చిత్రాన్ని రూపొందించిన ప్రేమ్ కుమారే తెలుగులో కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.  విజయ్ సేతుపతి - త్రిష పాత్రల్లో శర్వానంద్ - సమంతాలు నటిస్తున్నారు. తమిళ చిత్రానికి సంగీతం అందించిన గోవింద్ వసంత తెలుగులో కూడా సంగీతం అందిస్తున్నాడు.  ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతున్న ఈ సినిమాకు తాజాగా టైటిల్ ను లాక్ చేశారని సమాచారం.   శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ వారు రీసెంట్ గా ఫిలిం ఛాంబర్లో 'జానకీ దేవి' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారట. తమిళంలో సినిమా కథ జరిగే టైమ్ ఫ్రేమ్ ను టైటిల్ గా ఫిక్స్ చేస్తే.. తెలుగు వెర్షన్ కు వచ్చేసరికి హీరోయిన్ పేరును టైటిల్ గా నిర్ణయించారట !!   శర్వానంద్ ప్రస్తుతం సుధీర్ వర్మ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.  ఏప్రిల్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతారని.. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి ఆగష్టులో  రిలీజ్ చేయాలని  ప్లాన్ చేస్తున్నారట. 

Recent Gossips