ఆ అవకాశం నా జీవితాన్నే మార్చిందంటున్న సమంత 

28 Feb,2019

ఏ మాయ చేసావే’ సినిమాతో నాగచైతన్య సరసన హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సమంత. ఆ తరువాత చైతు – సామ్ సినిమాల్లో స్టార్స్ గా బిజీగా ఉన్న సమయంలోనే ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లైన తర్వాత మొదటిసారిగా సమంత నాగ చైతన్యతో నిన్ను కోరి చిత్రంతో హిట్ కొట్టిన యువ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలీ సినిమాలో నటిస్తోంది.
అయితే ‘ఏ మాయ చేసావే’ సినిమా వచ్చి ఈ రోజుతోటి 9 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ నిర్మాత మంజుల ఘట్టమనేని అంతా నిన్నే జరిగినట్టుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ కు సామ్ బదులు ఇస్తూ.. నా జీవితాన్నే మార్చేసిన అవకాశం ఇచ్చినందుకు థాంక్స్ అని సమంత పోస్ట్ చేసింది.

Recent Gossips