తమిళ అర్జున్ రెడ్డికి హీరోయిన్ దొరికింది

18 Feb,2019

టాలీవుడ్ లో సంచలన విజయం అందుకున్న అర్జున్ రెడ్డి చిత్రాన్ని తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ముక్యంగా తమిళంలో హీరో విక్రమ్ తనయుడు ధ్రువ హీరోగా బాల దర్శకత్వంలో వర్మ పేరుతొ షూటింగ్ చేసారు. కానీ సినిమా పూర్తియ్యాక ప్రొడ్యూసర్స్ కు అవుట్ ఫుట్ నచ్చక పోవడంతో ధృవ్ తప్ప మిగితా అందరిని మార్చి మళ్ళీ రీషూట్ చేస్తామని ఇటీవల అధికారికంగా ప్రకటించారు. అన్నట్లుగానే ఆ పనుల్లో వున్నారు. మళ్ళీ కొత్తగా నిర్మించనున్న ఈచిత్రానికి తాజాగా హీరోయిన్ ను ఫిక్స్ చేశారు.  ధృవ్ విక్రమ్ సరసన బెంగాలీ భామ మేఘ చౌదరి కథానాయికగా నటించింది. తాజాగా హీరోయిన్ ని కూడా మార్చుతున్నట్టు ప్రకటించిన టీమ్ కొత్త హీరోయిన్ గా   హిందీ హీరోయిన్ భణిత సంధు  నటించనుంది. అయితే ఇంకా ఈ చిత్రానికి డైరెక్టర్ ను ఖరారు చేయలేదు. ఈ4 ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. 

Recent Gossips